దేశంలో మరో 10 బుల్లెట్ రైళ్ళు!

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలైంది. ఇన్ని దశాబ్ధాల తరువాత ప్రధాని నరేంద్రమోడీ బుల్లెట్ రైల్ ప్రతిపాదన చేయడమే కాక దానికి కార్యరూపం కల్పిస్తున్నారు. ముంబై-అహ్మబాద్ మద్య నడువబోయే మొట్టమొదటి బుల్లెట్ రైలు 2022 ఆగస్ట్ 15వ తేదీన ప్రజలకు అందుబాటులో తేవాలనే లక్ష్యంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఏడు దశాబ్ధాలలో దేశాన్ని పాలించిన పాలకులు ఎవరికీ అసలు అటువంటి ఆలోచనే రాలేదు కానీ ప్రధాని నరేంద్రమోడీ చేసి చూపిస్తుంటే షరా మామూలుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాజెక్టుకు అనేక సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. వాటినాన్నిటినీ అధిగమించి గడువులోగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని మోడీ ప్రభుత్వం ధృడసంకల్పంతో ఉంది. అదే గొప్ప విషయమనుకొంటే దేశంలో మరో 10 బుల్లెట్ రైళ్ళు ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం చాలా ఆశ్చర్యకరం. అభినందనీయం. వాటికి ఇప్పుడు శ్రీకారం చూడితే మరో దశాబ్ధం తరువాత పూర్తవుతాయి. కనుక మోడీ ప్రభుత్వం దేశంలో వివిద ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది. 



సుమారు రూ. 10 లక్షల కోట్లు అంచనా వ్యయంతో 10 మార్గాలలో 6,000 కిలోమీటర్ల మేర ఈ బుల్లెట్ రైళ్ళను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ చేసిన ప్రతిపాదనలను మోడీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ కారిడార్లు:  

1. డిల్లీ-ముంబై 

2. డిల్లీ-కోల్‌కతా

3. డిల్లీ-భోపాల్ 

4. డిల్లీ-బనారస్ 

5. డిల్లీ-అమృత్ సర్ 

6. డిల్లీ-అహ్మదాబాద్

7. ముంబై-నాగపూర్ 

8. కోల్‌కతా-పాట్నా

9. చెన్నై-బెంగళూరు

10. చెన్నై-మైసూర్