
తెలంగాణ శాసనసభ ఉపసభాపతి ఎన్నికకు శాసనసభ కార్యదర్శి వి. నర్సింహాచార్యులు గురువారం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్ధులు నం నామినేషన్లు వేసినట్లయితే సోమవారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకే అభ్యర్ధి ఉన్నట్లయితే ఏకగ్రీవం అవుతుంది.
తెరాస తరపున తిగుళ్ళ పద్మారావుగౌడ్ పేరును సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలన్న తెరాస విజ్ఞప్తికి మజ్లీస్, బిజెపిలు సానుకూలంగా స్పందించాయి. కాంగ్రెస్ మద్దతు కూడా కోరేందుకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పద్మారావుగౌడ్ ను వెంటబెట్టుకొని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్కను కలిసి మాట్లాడారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి తమ నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు.