
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలకు బుదవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. తెరాసకు చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు మహమూద్ ఆలీ, మహమ్మద్ సలీం, టి.సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహమ్మద్ షబ్బీర్ ఆలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగుస్తుంది. కనుక వారి స్థానంలో ఎమ్మెల్సీలను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది.
ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ ఈవిధంగా సాగుతుంది:
నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 21 నుంచి 28వరకు
నామినేషన్ల పరిశీలన: మార్చి 1వ తేదీ
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 5వ తేదీ
పోలింగ్: మార్చి 15వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.