
మెట్రో సర్వీసు వేళల్లో స్వల్ప మార్పు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉదయం 6గంటలకు మెట్రో సర్వీలు ప్రారంభం అవుతున్నాయి. కానీ వచ్చేవారం నుంచి శనివారం ఉదయం 6.30 గంటలకు, ఆదివారం ఉదయం 7.00 గంటల నుంచి మొదటి సర్వీసులు మొదలవుతాయని మెట్రో అధికారులు తెలిపారు. కానీ రాత్రి 11 గంటలకు పూర్తయ్యే చివరి సర్వీసులో ఎటువంటి మార్పు ఉండబోదని చెప్పారు. ప్రస్తుతం అమీర్ పేట-ఎల్బీ నగర్, అమీర్ పేట-హైటెక్ సిటీల మద్య ట్రయల్ రన్స్ నడుస్తున్నందున తాత్కాలికంగా ఈ మార్పులు చేసినట్లు చెప్పారు. ఆ రెండు మార్గాలలో ట్రయల్ రన్స్ పూర్తికాగానే మళ్ళీ యధాప్రకారం ఉదయం 6గంటల నుంచే మొదటి సర్వీసులు మొదలవుతాయని చెప్పారు.