కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా దినేష్ గుండూరావు

కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న దినేష్ గుండూరావును కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయన మాజీ ముఖ్యమంత్రి ఆర్.గుండూరావు కుమారుడు. బెంగళూరులోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవి లభించలేదు. గత ఎనిమిదేళ్ళుగా కర్ణాటక పిసిసి అధ్యక్షుడుగా ఉన్న జి.పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో, అయన స్థానంలో దినేష్ గుండూరావును పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు.