.jpg)
ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పార్టీలలో పనిచేసిన నాగం జనార్ధన్ రెడ్డి చివరికి అదే కాంగ్రెస్ పార్టీలో చేరవలసివచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు మూడు నెలలు గడిచినప్పటికీ దానిని తిట్టిపోసే అలవాటు ఇంకా వదిలించుకోలేకపోయారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రధానకార్యాలయమైన గాంధీ భవన్ లో మంగళవారం అయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అలవాటు ప్రకారం ‘కాంగ్రెస్ అవినీతే అభివృద్ధికి ఆటంకం’ అని నోరు జారారు. ఆయన మాటలు విని విలేఖరులు గొల్లున నవ్వడంతో నాగం తడబడుతూ ఈసారి ‘తెరాస అభివృద్ధి...’ అంటూ ఏదో చెప్పబోయారు. అదివిని విలేఖరులు మళ్ళీ ముసిముసినవ్వులు నవ్వడం చూసి ‘సారీ సారీ...జస్ట్ ఫ్లోలో అలా వచ్చేసింది. ఇక్కడ అందరూ కాంగ్రెస్...కాంగ్రెస్ అంటూ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు కదా అందుకే ఆ ఫ్లోలో అలా అనేశాను... ‘తెరాస అవినీతే అభివృద్ధికి ఆటంకం’ అని తాను చెప్పదలచుకొన్న ఆ ముక్కను కష్టపడి చెప్పేశారు.
అయన అలవాటులో పొరపాటున అ మాటలు అన్నప్పటికీ అవి అయన అంతరంగాన్ని తెలియజేస్తున్నట్లున్నాయి. కాంగ్రెస్ అవినీతిపార్టీ అని, తెరాస సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని మనసులో అనుకొంటున్న మాటలనే పొరపాటున పైకి చెప్పేశారు. కానీ మళ్ళీ సర్దుకొని అందుకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడటం విశేషం.