
కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తెరాస సర్కార్ అవినీతి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కాళేశ్వరం ప్రాజెక్టులో బిగిస్తున్న మోటార్లు కొత్తవి కావు. అవి కాంగ్రెస్ హయంలో కొనుగోలు చేసినవే. వాటి వివరాలు కావాలని నేను సమాచార హక్కు క్రింద దరఖాస్తు చేసుకొంటే ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు?అలాగే ఎస్.ఎల్.బి.సి టన్నల్ పని ఎందుకు పూర్తి చేయడం లేదు అని ప్రశ్నిస్తే సమాధానం లభించడం లేదు. అతి త్వరలోనే సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతాను. ఒకవేళ ణా ఆరోపణలు తప్పని భావిస్తే ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయవచ్చు. నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్దంగా ఉన్నాను,” అని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.