
ఈరోజు ఉదయం ముంబైలో తృటిలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. ముంబైలోని అంధేరీ రైల్వే స్టేషన్ సమీపంలో గోఖలేరోడ్డు వద్ద గల ఫుట్-ఓవర్ బ్రిడ్జి అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దాని దిగువనే ఉన్న రైల్వే ట్రాక్ పై ఆ శిధిలాలు పడిపోయాయి. ఆ ట్రాక్ పై నిత్యం వందలాది సబర్బన్ రైళ్ళు ప్రయాణిస్తుంటాయి. అత్యంత రద్దీగా ఉండే సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ ట్రాక్ పై రైళ్ళు రాకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయలైనట్లు సమాచారం.
ఈ ప్రమాదం సంగతి తెలుసుకొన్న సబర్బన్ రైల్వే అధికారులు ఆ మార్గంలో రైళ్ళను నిలిపివేశారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్ పై నుంచి శిధిలాల తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతోంది. అత్యంతరద్దీగా ఉండే సమయంలో ఆ మార్గంలో రైళ్ళ రాకపోకలు నిలిచిపోవడంతో ఉద్యోగాలకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.