కత్తి మహేష్ అరెస్ట్

సినీ విమర్శకుడు కత్తి మహేష్ ను బంజారా హిల్స్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వి.హెచ్.పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనపై పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఇవాళ్ళ ఉదయం ఆయనను కోర్టులో హాజరుపరిచిన తరువాత రిమాండ్ పై చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేస్తే వెంటనే విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. 

కత్తి మహేష్ బిగ్ బాస్-1 షోలో పాల్గొన్న తరువాతే మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ...అయన అభిమానులతో గొడవలుపడుతూ అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. అప్పటి నుంచి దర్శకుడు రాంగోపాల్ వర్మ స్టైల్లో ఎవరో ఒకరిపై లేదా ఏదో ఒక సున్నితమైన అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. కానీ ఇప్పుడు అదే కారణంగా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. బహుశః ఇది కూడా ఆయన పాపులారిటీ గ్రాఫ్ ఇంకా పెరిగేందుకు దోహదపడవచ్చు.