రాష్ట్రంలో రేషన్ దుఖాణాలు బంద్

నేటి నుంచి రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమ్మె మొదలయింది. రాష్ట్రంలో మొత్తం 17,200 రేషన్ డీలర్లు ఉండగా వారిలో కేవలం 500 మంది మాత్రమే జూలై నెలలో రేషన్ సరుకులు విడిపించుకోవడానికి సకాలంలో డిడిలు తీశారు. మిగిలినవారందరూ డిడిలు తీయకుండా, నేటి నుంచి దుఖాణాలు మూసివేసి సమ్మె ప్రారంభించారు. తమకు నెలకు కనీసం రూ.15,000 వేతనం చెల్లించాలని, రూ.600 కోట్ల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారి డీలర్ షిప్పులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించినా వారు ఏమాత్రం భయపడలేదు వెనక్కు తగ్గలేదు. ఈసారి తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె విరమించబోమని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. దాంతో ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీకి పౌరసరఫరా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.