3.jpg)
ఏపి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక సంచలన ప్రకటన చేశారు. అయన ఆదివారం కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో జనసేన, సిపిఐ పార్టీలు కలిసిపోటీ చేస్తాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్ధి. పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ, మంచి రాజకీయ పరిణతి కలిగిన నాయకుడు,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ మాటలలో వామపక్షభావజాలం కనిపిస్తుంటుంది కనుక వాటితో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే పెద్ద విచిత్రమేమీ కాదు. కానీ ఆయనే మా ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ఇప్పుడే ప్రకటించేయడమే విచిత్రంగా ఉంది. అయితే ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానులకు (జనసేన కార్యకర్తలు)కు చాలా ఉత్సాహం కలిగిస్తుంది.