రైతుబంధు వివారాలు ఇవ్వండి: హైకోర్టు

రైతుబంధు పధకంపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. దానికి సబందించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించవలసిందిగా న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఇదివరకే ఈ పధకం విధివిధానాలను ప్రశ్నిస్తూ నల్గొండకు చెందిన యాదగిరి రెడ్డి అనే రైతు హైకోర్టుకు వ్రాసిన లేఖను ప్రజాహిత వాజ్యంగా స్వీకరించి విచారణ ప్రారంభించింది. ఆ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ కేసు జూలై 10వ తేదీకి వాయిదా పడింది. తాజాగా కౌలురైతులకు కూడా ఈ పధకాన్ని వర్తింపజేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. దానిపై నిన్న విచారణ జరిగింది. 

అయితే నిన్న గద్వాలలో జరిగిన బహిరంగసభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ కౌలురైతులకు రైతుబందు పధకాన్ని వర్తింపజేయలేమని స్పష్టం చేశారు. కనుక ఈవిషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టమవుతోంది. కానీ అదే కారణంగా న్యాయపోరాటం చేయక తప్పదని కూడా స్పష్టం అవుతోంది.