గద్వాలలో గట్టు ఎత్తిపోతల పధకానికి సిఎం కెసిఆర్ శుక్రవారం శంఖుస్థాపన చేశారు. అనంతరం గద్వాలలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ గద్వాలకు అనేక వరాలు ప్రకటించారు. ఆ వివరాలు:
1. గట్టు ఎత్తిపోతల పధకానికి చరిత్రకారుడు నల్ల శోభనాద్రి పేరు ఖరారు.
2. గద్వాల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు.
3. గద్వాల ప్రభుత్వాసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తాం.
4. గద్వాల బస్టాండ్ అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు.
5. గద్వాల జిల్లాకు ఒక ఎస్సీ స్టడీ సర్కిల్, రెసిడెన్షియల్ పాఠాశాల మంజూరు చేస్తాం.
6. 2019లో మరో 119 బిసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం.
7. జూరాల వద్ద బృందావనం పార్క్ ఏర్పాటుకు రూ.15 కోట్లు మంజూరు చేస్తాం.
8. కేటిదొడ్డి మండల కేంద్రంలో గిరిజనుల పిల్లల కోసం గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం.
9. గుర్రంగడ్డ వంతెన నిర్మాణం కోసం రూ.8 కోట్లు మంజూరు చేస్తాం.