
మాజీ ప్రధాని స్వర్గీయ పివినరసింహరావు జయంతి సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ఎంతో సేవ చేసిన తెలంగాణా బిడ్డడు స్వర్గీయ పివినరసింహరావు. రాష్ట్రంలో ఒక జిల్లాకు అయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
దానిపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, “అయన బ్రతికి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించలేదు. కనీసం చనిపోయిన తరువాత గౌరవించలేదు. డిల్లీలో అంత్యక్రియలు చేసి అక్కడ అయన పేరిట ఒక ఘాట్ ఏర్పాటు చేయాలని అందరూ కోరితే ఆయన శవాన్ని హడావుడిగా హైదరాబాద్ తరలించేసింది. కనీసం అయన అంత్యక్రియలైన సక్రమంగా చేయలేదు. అప్పుడు ఆయనను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అయన పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయన చనిపోయిన తరువాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కదా? ఆయనపై మీకు అంత గొప్ప గౌరవమే ఉండి ఉంటే మరి అప్పుడే ఒక జిల్లాకు అయన పేరు ఎందుకు పెట్టలేదు?” అని ప్రశ్నించారు. నిజమే కదా!