
సిఎం కెసిఆర్ గురువారం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొన్నప్పుడు ఏపి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడుతూ తాను 2019ఎన్నికల తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే దుర్గమ్మను దర్శించుకోవడానికి వస్తానని అన్నారు. అంటే ముఖ్యమంత్రి అయితే దుర్గమ్మ దర్శనం చేసుకొంటానని మరో మొక్కు మొక్కినట్లే భావించవచ్చు. అదేమీ తప్పూ కాదు..విచిత్రమూ కాదు. అయితే 2019 ఎన్నికల తరువాత ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయరాజకీయాలలోకి వెళతానని చెప్పి ప్రత్యేకవిమానాలు వేసుకొని ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వెళ్లి హడావుడి చేసిన సిఎం కెసిఆర్, ఇప్పుడు 2019ఎన్నికల తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే దుర్గమ్మను దర్శించుకోవడానికి వస్తానని చెప్పడమే విచిత్రం. అంటే ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన అటకెక్కించినట్లేనా? అనే అనుమానం కలుగుతోంది.