సిఎం కెసిఆర్ రేపు విజయవాడ పర్యటన

తెలంగాణా సిఎం కెసిఆర్ గురువారం విజయవాడకు వెళ్ళనున్నారు. తెలంగాణా ఏర్పడితే కనకదుర్గమ్మకు ముక్కు పుడక చేయిస్తానని కెసిఆర్ మొక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మొక్కు తీర్చుకోవాలని గతంలో రెండుమూడుసార్లు ప్రయత్నించిన పని ఒత్తిడి కారణంగా వెళ్ళలేకపోయారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కుటుంబ సమేతంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కు చెల్లించుకొంటారు. మళ్ళీ సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.