జూన్ 29న సిఎం కెసిఆర్ గద్వాల్ పర్యటన

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ 29వ తేదీన జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించనున్నారు. తుమ్మిళ్ళ ఎత్తిపోతల పధకం పనులను పరిశీలించిన తరువాత గట్టు ఎత్తిపోతల పధకానికి శంఖుస్థాపన చేస్తారు. అనంతరం గద్వాల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. దానం నాగేందర్ చేరిక సందర్భంగా సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలు, సర్వే ఫలితాల గురించి మాట్లాడారు కనుక గద్వాల్ సభలో అందుకు అనుగుణంగానే అయన ప్రసంగం ఉండవచ్చు.