వాస్తుతో పాలన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం- మనోహర్ పారికర్

తెలంగాణ రాష్ట్రంలో వాస్తు ప్రకారం పాలన జరుగుతోందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వాస్తు ప్రకారం వివిధ భవనాలను కూల్చాలని యోచిస్తున్న నేపధ్యంలో పారికర్ ఈ వ్యాఖ్య చేశారు.

విపరీతమైన ఫిరాయింపులు టిఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించడం సరికాదని ఆయన అన్నారు. ఆ పార్టీలో కొత్తగా చేరినవారంతా ఏడాది కూడా తిరగక ముందే వెనక్కి వచ్చేస్తారని రక్షణ మంత్రి జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకు అనేక అవకాశాలు ఉన్నాయని, ముందుగా బలమైన ప్రతిపక్షంగా బీజెపీ ఎదగాలని, దాని తర్వాత ప్రభుత్వం కూడా ఏర్పరుచుకునే బలమొస్తుందని పారికర్ అన్నారు. అయితే పార్టీలో సమాచార లోపాలున్నాయని అవి సరి చేస్కుని ముందుకి సాగితే ఎదురుండదని పారికర్ అన్నారు.