
హైదరాబాద్ లో మొత్తం 14 వేల మంది యాచకులు ఉన్నారని, అందులో 98% మంది నకిలీ వాళ్ళే అని మేయర్ బొంతు రామ్మోహన్ రావు అన్నారు.
సిటీ లోని యాచకులు ఏడాదికి రూ 24 కోట్లు ఆర్జిస్తున్నారు. దానితో వ్యభిచారం, డ్రగ్స్ వంటి ఎన్నో అక్రమ సంపాదన మార్గాలు ఎంచుకుంటున్నారు, కాబట్టి యాచకులకు డబ్బులు ఇవ్వకండి అని, బొంతు అన్నారు. అంతే కాకుండా, నిజమైన యాచకులు ఉంటే వారికి పునరావాసం కల్పిస్తామని, అందు కోసం అలాంటి యాచకుల గురించి ఎటువంటి సమాచారం తెలిసినా ఈ కింది నంబర్లకు ఫోన్ చేసి చెప్పవలసిందిగా మేయర్ తెలిపారు. ఇందుకోసం సిటీలో బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు.
ఫోన్ చేయవల్సిన హెల్ప్ లైన్ నంబర్స్: 9908111355, 9441746906, 9866289793