ట్విట్టర్ లో మోడీ అభిమానుల హవా

ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు మరియు అనుచరులు, తమ అభిమానాన్ని చాటుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. #VishwaNayakPM అని హాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. ఈ ట్యాగ్ ని ఉపయోగిస్తూ ప్రధాని సాధించిన గ్లోబల్ విజయాల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 

ద్వైపాక్షిక సంబంధాలు పెంచడానికి మోడీ ఎలా కృషి చేస్తున్నారు, ఇతర దేశాలాకు ఎలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని పలు రకాల విషయాలు ఈ ట్యాగ్ తో నెటిజన్లు ఒకరికొకరు వివరించుకోవడం విశేషం. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉన్నారు. స్విస్ అధ్యక్షుడు జోహన్ ష్నీదర్-అమ్మన్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచే దిశగా మాట్లాడతారు.