మథుర లో కలకలం: ఇద్దరు పోలీసుల మృతి

అక్రమంగా చాలా కాలం నుండి మథుర లోని ఒక పార్క్ ని ఆక్రమించుకొని ధర్నాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 'స్వాధీన్ భారత్ సుభాష్ సేన' (ఎస్బీఎస్ఎస్) కార్యకర్తలను పార్క్ ఖాళీ చేయించే ప్రయత్నంలో, మథుర ఎస్పీ ముకుల్ ద్వివేది మరియు ఫరా పోలీసు స్టేషన్ అధికారి సంతోష్ యాదవ్,  మరణించిన పద్నాలుగు మందిలో ఉన్నారు. 

అలహాబాద్ హైకోర్టు ధర్నా కొనసాగించే అనుమతి కోరుతూ ఎస్బీఎస్ఎస్ దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించింది. ఆ తర్వాత 3000 పైగా ఉన్న ఆక్రమణదారులను ఖాళీ చేయించే యత్నంలో ఉన్న పోలీసులపై, సేన కార్యకర్తలు తుపాకులతో దాడి చేశారు. ఆ దాడిలో భాగంగానే ఇద్దరు పోలీసులు మృతి చెందారు.

సమస్యకు స్పందిస్తూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారణకు ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ మరియు డిజిపిని మథుర పార్క్ ని సందర్శించి పరిస్థితి ని తెలుసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. గత రెండున్నర సంవత్సరాల నుండి అధికారులు ఎన్నో రకాలుగా  సేన కార్యకర్తలను పార్క్ ని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. సేన నుండి సంఘటన గురించి స్పందించడానికి ఎవరూ ముందుకు రాకపోయినా, వారి ఫేస్ బుక్ పేజ్ ప్రకారం తెలుపుతున్న సందేశం ఈ క్రింది విధంగా ఉంది.

"మేము నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నిజమైన అనుచరులం. న్యాయ, శాసన, మరియు ఎగ్జిగ్యూటివ్ వ్యవస్థ, లాంటి అన్ని పాలక యంత్రాంగాల నుండి కావలసిన సమాచారం మేము తెలుసుకోగలగాలి. శాంతిభద్రతల రికార్డులు, పౌరసత్వ పత్రాలు మొదలగునవి బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం."