దావూద్ ఇబ్రహీంతో రెవిన్యూ మంత్రి సంబంధాలు, జూన్ 6న విచారణ

రెవిన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కి దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయంటూ, వడోదర హ్యాకర్, మనీష్ భంగాలే వేసిన పిటీషన్, జూన్ 6న బొంబాయి హై కోర్ట్ లో విచారణ జరుపుకుంటుంది.

గత కొంత కాలంగా, కరాచి లో దావూద్ ఉంటున్న ఇంటి నుండి వెళ్ళే ఫోన్ కాల్స్, ఖడ్సే పేరుతో ఉన్ననంబరుకి చేరుతున్నాయని భంగాలే పిటీషన్ లో వివరించారు. దీని పై స్పందించిన కాంగ్రెస్ లీడర్ సందీప్ దీక్షిత్, నిజానిజాలు తెలియకపోయినా, దావూద్ కి సంబంధించిన ఏ విషయాన్ని తేలికగా తీసుకోరాదని, విచారణ జరపాల్సిందే అని వ్యాఖ్యానించారు.

మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ అందుకుంటూ, విచారణ సక్రమంగా జరగాలంటే, ఖడ్సే రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆప్ నాయకుడు ప్రీతి శర్మ మీనన్ మాట్లాడుతూ, నెల క్రితం వరకు కూడా ఖడ్సే నెంబర్ పనిచేస్తుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపనలను ఖండించిన ఖడ్సే, నంబర్ తనదేనని మాత్రం ఒప్పుకోక తప్పలేదు.