ప్రపంచంలోనే మోస్ట్ స్టుపిడ్ పీఎం నరేంద్ర మోడీ- కాంగ్రెస్ నేత

ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు, నెటిజన్లలో కూడా తీవ్ర దుమారం రేపాయి. తన రెండేళ్ళ పాలనలో మోడీ దేశాన్ని అస్తవ్యస్తం చేశారని, ఇలాంటి మనిషి పైన ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌ని రషీద్ అల్వీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ప్ర‌శ్నించారు. ఐతే ఈ వ్యాఖ్యలకు స్మృతి తనదైన శైలిలో ఘాటుగానే స్పందించారు.

ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు తమ పరిధిని, తమ స్థాయిని గుర్తు చేసుకోవాలని, అనవసరంగా లేనిపోనివి మాట్లాడుతూ విషం చిమ్మడం సరికాదని స్మృతి అన్నారు. అంతే కాకుండా పలువురు బీజేపీ నేత‌లు కూడా రషీద్ అల్వీ వ్యాఖ్య‌ల ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మరో వైపు ఈ కాంగ్రెస్ నేత పైన సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఎన్నో చమక్కులు విసురుతూ, మోడీ గురించి మాట్లాడే స్థాయి వచ్చాక మాట్లాడితే బాగుంటుందని ట్వీట్లు పెట్టారు.