డ్రైనేజీలో పడ్డ బీజెపీ ఎంపీ

డ్రైనేజీ సమస్య పై మాట్లాడడానికి వచ్చిన ఎంపీ గారు అదే డ్రైనేజీలో పడిపోయిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

బీజె పీ ఎంపీ, పూనం బెన్ మేడం, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల విషయాలను పరిశీలించేందుకు గుజరాత్ లోని జామ్ నగర్ స్లమ్ ఏరియా కి వెళ్ళారు. అక్కడి జనాలతో మాట్లాడుతున్న సమయంలోనే, తాను నుంచుని ఉన్న  డ్రైనేజీ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఎంపీతో గారితో పాటు సెక్యూరిటీ సిబ్బంది దాదాపు ఎనిమిది ఫీట్ల గోతిలో పడ్డారు.

అప్రమత్తమైన సిబ్బంది, గాయాల  పాలైన మేడంను వెంటనే దగ్గరిలోని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. తలపైన ఐదు కుట్లు వేసిన డాక్టర్లు మేడం 'అవుట్ ఆఫ్ డేంజర్' అని ప్రకటించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఎంపీ గారిని ముంబై ఆసుపత్రి కి తరలించారు.