జాదవ్ పూర్ యునివర్సిటీ మహిళలకు సిగ్గు లేదు - దిలీప్ ఘోష్

ఏబివిపి కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారు అని ఆరోపణలు చేసి మళ్ళీ నిరసనలలో పాల్గొనడం, జాదవ్ పూర్  యునివర్సిటీ మహిళా విద్యార్థుల సిగ్గుచేటుకు నిదర్శనం అని బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు.

'బుద్ధ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' అనే సినిమా స్పెషల్ షో యూనివర్సిటీ లో ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఏబివిపి కార్యకర్తలకి యూనివర్సిటీ విద్యార్థులకి మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవలో భాగంగా, ఏబివిపి కార్యకర్తలు తమపై అసభ్యంగా ప్రవర్తించారని యునివర్సిటీ మహిళా విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారు.

ఈ విషయం పై స్పందించిన దిలీప్ ఘోష్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఏబివిపి కార్యకర్తలకి విద్యార్థుల పట్ల అన్ని హక్కులు ఉంటాయని, వాక్ స్వాతంత్రయాన్ని నమ్మే విద్యార్థులు ఆ హక్కు అందరికి వర్తిస్తుందని తెలుసుకోవాలని అన్నారు. అది తెలుసుకోకుండా, పైగా చదువుకునే విద్యార్థులై ఇలా సిగ్గు లేకుండా ప్రవర్తించడం దురదృష్టకరమని తీవ్రస్తాయిలో విరుచుకు పడ్డారు.
ఈ వ్యాఖ్యలు యునివర్సిటీ లో తీవ్ర దుమారం రేపాయి. మంచి చెడుల గురించి ఇతరుల నుండి నేర్చు కోవలసిన స్టేజి లో తాము లేమని, విద్యార్థులు తేల్చి చెప్పారు.

జె ఎన్ యు, హెచ్ సి యు తర్వాత ఇలా మరో మారు దేశంలోని యునివర్సిటీ వార్తల్లోకి ఎక్కడం దురదృష్టకరమని, ఇది ఇలాగే కొనసాగితే, భవిష్యత్తు విద్యార్థులందరూ రౌడీలుగానే కొనసాగాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.