ఒమర్ అబ్దుల్లాకి ఎప్పుడూ అది తప్పదుట!

భారత్ మా మిత్రదేశమని అమెరికా పదేపదే చెపుతుంటుంది కానీ అమెరికాకి వస్తున్న భారతీయులని విమానాశ్రయాలలో తనికీల పేరిట అవమానిస్తూనే ఉంటుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకి న్యూయార్క్ విమానాశ్రయంలో అటువ్నటి చేదు అనుభవమే ఎదురైంది. న్యూయార్క్ యూనివర్సిటీలోజరుగబోయే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయనని తనికీల పేరిట విమానాశ్రయంలో రెండు గంటలు నిలిపివేశారు.

ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అనే సంగతి వారికి తెలియదనుకోలేము. ఆ కారణంగా ఆయన తనికీల నుంచి మినహాయింపులేమీ కోరుకోలేదు. కనీసం సాధారణ ప్రయాణికుడిగా పరిగణించినా అంతసేపు నిర్బంధించి ఉంచరు కానీ తనని రెండు సార్లు తనికీలు చేశారని దాని కోసం రెండు గంటలు నిలిపివేశారని ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరో కొత్త విషయం కూడా చెప్పారు. తను అమెరికా ఎప్పుడు వచ్చినా ఇదే తంతు అని చెప్పారు. ఆయన ముస్లిం కావడం, కాశ్మీర్ కి చెందిన వారవడం చేతనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానిస్తున్నట్లున్నారు.