ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లో ఇవ్వాళ్ళ చాలా ఘోర దుర్ఘటన జరిగింది. కాశీ పుణ్యక్షేత్రానికి సమీపంలో చందౌలి అనే ప్రాంతంలో గంగానదిపై ఉన్న రాజ్ ఘాట్  వంతెనపై జరిగిన త్రొక్కిసలాటలో 19 మంది చనిపోయారు. మరో 50-100 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 15మంది మహిళలే. 

ఈరోజు చందౌలి సమీపంలో బాబా జై గురుదేవ్ సభ నిర్వహించారు. దానికి కేవలం 3,000 మంది మాత్రమే వస్తారని అంచనా వేస్తే సుమారు 70-75,000మంది రావడం, అందరూ ఒకేసారి రాజ్ ఘాట్  వంతెనలోకి ప్రవేశించడంతో త్రొక్కిసలాట జరిగింది. ఈ సభకి కేవలం 3000మంది ప్రజలే తరలి వస్తారని ఊహించినప్పటికీ, అది ఆ వంతెనకి చాలా ఎక్కువేనని చెప్పవచ్చు. కనుక ముందుగానే అక్కడ ఏమాత్రం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినా ఈ దుర్ఘతబ్న జరిగి ఉండేదే కాదు. కానీ సమాచార లోపం వల్లనయితేనేమీ, స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లనయితేనేమీ వంతెన ప్రవేశం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వలనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటన జరిగియన్ తరువాత అప్రమత్తమైన పోలీసులు, అధికారులు బారీ సంఖ్యలో తరలివచ్చి సహాయ చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే జరుగాకూడని నష్టం జరిగిపోయింది. అకారణంగా 19 మంది చనిపోయారు. 

ఈ సంగతి తెలియగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంతాపం ప్రకటించి చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు సహాయం ప్రకటించారు.