పంజాబ్ ఎన్నికల సర్వే రిపోర్ట్

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటి ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందుకే ఇండియా టుడే-యాక్సిస్ సంస్థలు కలిసి ఆ రెండు రాష్ట్రాలలో సర్వేలు నిర్వహించి ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేశాయి. మొదట ఉత్తరప్రదేశ్ సర్వే ఫలితాలు వెల్లడించిన ఆ సంస్థలు తాజాగా పంజాబ్ ఫలితాలు వెల్లడించాయి.    

పంజాబ్ లో మొత్తం సీట్లు: 117

ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్: 59 సీట్లు

కాంగ్రెస్ పార్టీ: 49-55 సీట్లు, అధికార శిరోమణి అకాలీ దళ్-భాజపా కూటమికి: 17-21 సీట్లు, ఆమాద్మీ పార్టీ : 42-46 సీట్లు, ఇతరులు:  3-7 సీట్లు.

అంటే ఈ ఎన్నికలలో అధికార కూటమి ఓటమి పాలవబోతున్నట్లు అర్ధమవుతోంది. యూపిలో మిగిలిన అన్ని పార్టీల కంటే వెనుకబడిపోయిన కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో మాత్రం అధికారం చేజిక్కించుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది కనుక ఈలోగా కాంగ్రెస్ పార్టీ పంజాబ్ పై మరింత శ్రద్ధ పెట్టి ప్రచారం చేస్తే పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలుంటాయి. ఆమాద్మీ పార్టీకి కూడా ఈ సర్వే ఫలితాలు చాలా ఆశాజనకంగానే కనబడుతున్నాయి కనుక అది కూడా గట్టిగా ప్రచారం చేసుకొంటే సానుకూల ఫలితాలు రావచ్చు.