అది చూసి లోకేష్ రోమాలు నిక్కబొడుచుకొన్నయిట!

అవును..నిజమే! మావగారిని చూస్తే అల్లుడి రోమాలు నిక్కబొడుచుకొన్నయిట! ఆ మావగారు నందమూరి బాలకృష్ణ...అల్లుడు నారా లోకేష్. దసరా పండుగ సందర్భంగా విడుదలైన "గౌతమీ పుత్రశాతకర్ణి సినిమా టీజర్ లో మావగారిని చూస్తే ఒంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకొన్నాయి. ఆ లెజండ్ సినిమా విడుదలయ్యేవరకు ఆగలేకపోతున్నాను,” అని ట్వీటర్ లో మెసేజ్ పెట్టారు.

మావగారు ఆ గెటప్ లో చాలా అద్భుతంగా ఉన్నారని చెపితే సరిపోయేదానికి రోమాలు నిక్కబొడుచుకొన్నయని అల్లుడు నారా లోకేష్ చెప్పడం కొంచెం అతిగానే ఉంది. నారా లోకేష్ తమ పార్టీ రాజకీయ ప్రత్యర్ధులపై ట్వీటర్ లో చాలా చక్కటి చురకలు వేస్తూనే ఉంటారు. కానీ మావగారి సినిమా విషయంలో ఆయన వేసిన ట్వీటు కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ప్రసంగాల విషయంలో కూడా నారా లోకేష్ తడబడుతూనే ఉంటారు. ఒక్కోసారి స్వంత పార్టీనే విమర్శించుకొని తరువాత తూచ్..అన్న సందర్భాలున్నాయి. ఇది కూడా అటువంటిదేననుకోవాలి. లేకపోతే మావగారిని చూసి అల్లుడి రోమాలు నిక్కబొడుచుకోవడం ఏమిటి?