
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం చెన్నై బయలుదేరుతున్నారు.ఆయన రాష్ట్ర ఇన్-చార్జ్ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావు ద్వారా ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొంటునప్పటికీ, ఆమె ఇంకా చాలా రోజులు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుందని తెలియడంతో ఆమెని చూసేందుకు ఈరోజు చెన్నై బయలుదేరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న చెన్నై వచ్చి ఆమెకి చికిత్స చేస్తున్న వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని తిరిగి వెళ్ళారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నట్లు చెప్పారు. తమకి మిత్రపక్షమైన అన్నాడిఎంకె పార్టీకి ఈ కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పారు.
జయలలిత క్యాబినెట్ లో ఇద్దరు సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళని స్వామీ నిన్న గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావుని నిన్న సాయంత్రం కలిసారు. వారిలో ఎవరో ఒకరు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని నిన్న వార్తలు వచ్చాయి కానీ గవర్నర్ కార్యాలయం నుంచి అటువంటి ప్రకటన ఏదీ వెలువడలేదు.