పవన్ కళ్యాణ్ అభిమానులకి శుభవార్త

పవన్ కళ్యాణ్ అభిమానులకి శుభవార్త. కాకినాడ బహిరంగ సభ తరువాత మళ్ళీ సినిమా షూటింగులకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇవ్వాళ్ళ ఒకేసారి ఫేస్ బుక్, ట్విట్టర్ రెండింటిలోను ఖాతాలు తెరిచారు. దానిలో పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాలలో వివిధ అంశాలపై చేసిన ప్రెస్ మీట్స్, బహిరంగ సభలలో చేసిన ప్రసంగాలు, మీడియా ఇంటర్వ్యూలు, వీడియోలు వగైరా అందులో ఉంచబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే వ్యక్తిగతం ట్విట్టర్ లో ఖాతా తెరిచినప్పటికీ దానిలో ఆయన ఎటువంటి కొత్త మెసేజులు పెట్టడం లేదు. కనుక ఈ రెండు నెట్ వర్క్స్ లో కూడా ఆయన స్వయంగా తన సందేశాలని పెడతారా లేకపోతే ఆయన తరపున ఆయన ప్రతినిధులు ఎవరైనా అభిమానులకి మెసేజులు పెడతారా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఏమనప్పటికీ చిరకాలంగా ఇటువంటి అవకాశమే ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అప్పుడే వాటిలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రింద ఈయబడిన లింక్స్ పై ప్రెస్ చేస్తే ఆ ఖాతాలలోకి మీరూ ప్రవేశించవచ్చు. 


Janasena on Facebook

Janasena on Twitter

Janasena on YouTube