
ఏపిలో రాజకీయ పరిస్థితులు పవన్ ఎంట్రీతో ఒక్కసారిగా మారాయి. పవన్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ గా లేని జనసేనాని ఒక్కసారిగా తిరుపతి సభతో అందరికి షాకిచ్చారు. అయితే పవన్ ఎంట్రీ, కాకినాడ సభ గురించి ముందే చెప్పడంపై రాజకీయ పరిశీలకులు మరోలా విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏపిలో అంతకంతకు ఎదుగుతున్న జగన్ ను కట్టడి చెయ్యడానికే పవన్ ను రంగంలోకి దించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ తో జగన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల నుండి తెలుసుకున్న చంద్రబాబునాయుడు, హోదా వచ్చే ప్రసక్తే లేదు, ఏదయినా ప్రతేక ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ ఉండటంతో, ఏ విషయంలో కూడా జగన్ కు ఎటువంటి క్రెడిట్ రాకూడదని, పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించినట్లు పొలిటికల్ టాక్ వినిపిస్తుంది. ఇన్నాళ్ళుగా హోదా ఫై ప్రతిపక్షం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న మాట మాత్రం మాట్లాడని పవన్ కళ్యాణ్ సడన్ గా హోదా విషయమై తిరుపతిలో సభ పెట్టడంతో కొందరికి ఈ ఆలోచన వచ్చింది.
ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ, నమ్మేట్లుగా మాత్రం ఉంది. అటు ఎలక్షన్స్ సమయంలో వాడుకునట్లుగానే, జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను అనగతొక్కేందుకే మళ్ళీ పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబు అండ్ కో, వాడుకుంటున్నారనేది ప్రూవ్ అయిందా అనేది మీరే ఆలోచించాలి ఒక్కసారి.