రోజాకు పవన్ అభిమానుల ధ్యాంక్స్

అదేంటి ఎమ్మెల్యే రోజాకు పవన్ కల్యాణ్ అభిమానులు థ్యాంక్స్ చెప్పడం ఏంటా అనుకుంటున్నారా..? అవును ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫోన్ చేసి మరీ అభినందించారని..  పవన్ ను మొత్తానికి మాట్లాడేలా చేశారని వారు ఆమెకు థ్యాంక్స్ చెప్పారట. కొన్నాళ్ల క్రితం పవన్ గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అని వ్యాఖ్యానించింది. పవన్ ఆ వ్యాఖ్యల తర్వాత చాలా రోజులకు తిరుపతి సభతో జనాల మధ్యకు వచ్చారు. 

ఇలా పవన్ మీద రోజా చేసిన వ్యాఖ్యలు పని చేశాయని.. అందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫోన్ చేసి మరీ రోజాను అభినందించినట్లు ఆమె వెల్లడించారు. తిరుపతి సభ వేదికగా సాగిన పవన్ స్పీచ్ లో రోజా గురించి ప్రస్తావన వచ్చింది. అనాలోచితంగా మాట్లాడితే మహా అయితే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు రోజాను ఉద్దేశించినవే అని అందరూ అనుకుంటున్నారు. కాగా రోజా చేసిన పవన్ అభిమానుల అభినందనలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.