వరుస బాంబు పేలుళ్లతో భీతావహ పరిస్థితి.. ఒకరు మృతి..

థాయ్ లాండ్ లో వరుస బాంబు పేలుళ్లతో బీతావహా పరిస్థితి అలుముకుంది, దక్షిణ థాయ్ పట్టణ ప్రావిన్స్ లోని కోస్తా పట్టణం పఠానీలో మంగళవారం అర్థరాత్రి వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది.  మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ధాయ్ లాండ్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి పబ్ కు అతి సమీపంలో పేలుడు జరిగింది.  

ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో అరగంట వ్యవధిలో మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, 30 మంది గాయపడ్డారని పోలీసులు అధికారులు తెలిపారు. స్థానిక మార్కెట్ సమీపంలో మరో బాంబు పేలుడు జరిగింది. రెండు వారాల క్రితమే వరుస పేలుళ్లు దేశాన్ని కుదిపేసిన తర్వాత మళ్లీ అలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకోవడంతో ధాయ్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు తమ దేశ పౌరులకు ఆంక్షలు విధించాయి. ధాయ్ లాండ్ పర్యటనకు తమ దేశ పౌరులు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. 

కేవలం పక్షం రోజుల వ్యవధిలో ఇలా బాంబు దాడుల చోటు చేసుకోవడంతో పలు దేశాలు అందోళన వ్యక్తం చేస్తూ.. ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో వున్న తమ దేశ పౌరులను స్వదేశాలకు రావాల్సిందిగా కూడా కోరుతున్నారు. పక్షం రోజుల క్రితం ఉత్తర ధాయ్ లాండ్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో నలుగురు మరణించగా, 11 మంది విదేశీ పర్యాటకులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బాంబు దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం.