ఆమెదే కారు, ఆమెకే ప్రమాదం

తాను డ్రైవింగ్ చేస్తున్న కారు కింద పడిన ఓ మహిళ గాయాలపాలైన విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఏంటి తాను నడుపుతున్న కారు కింద తానే ఎలా పడిందన్న అనుమానం కలుగుతుంది కదూ? కానీ ఇది నిజం. అమెరికాలోని వాషింగ్టన్ లోని బర్లింగ్టన్ లో ఓ గ్యాస్ స్టేషన్ కు కారులో వచ్చిన ఓ యువతి ఇంధనం నింపించుకుంది. హడావిడిగా వెళ్తుందనుకుంటా.. అందుకనే ఇంధన ట్యాంకర్ క్యాప్ పెట్టడం మర్చిపోయి, ప్రయాణం ప్రారంభించింది. ఓ జంక్షన్ వద్దకు రాగానే ఇంధనం ట్యాంకర్ కి మూత వేయలేదంటూ పక్కగా వచ్చిన ఓ కారు డ్రైవర్ చెప్పారు. 

దీంతో, ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో హడావిడిగా కారు దిగి క్యాప్ పెట్టిన మహిళ.. కారు కదులుతుండటాన్ని గమనించింది. అంతలో కారులోకి ఎక్కే ప్రయత్నం చేసింది. కానీ కొన్ని అడుగులు వేసి కారు ఎక్కబోయే ప్రయత్నం చేసి విఫలమైంది. అంతే అలాగే కిందపడిపోయింది. కారు ఏకంగా అమె కాళ్లపై నుంచి వెళ్లింది. వెనకగా వచ్చిన మరో కారులోంచి పలువురు దిగి అమెను పైకి లేపారు. అయితే తనకు గాయాలేమి కాలేదని, తనను లేపమని మహిళ అర్థించింది. 

అయితే అమె నడుపుతున్నది డ్రైవర్ లెస్ కారని తెలిసింది. కారు పెట్రోల్ ట్యాంక్ క్యాప్ పెట్టే హాడావిడిలో అమె కారును పార్కింగ్ లో పేట్టడం మర్చిపోయింది. దీంతోనే కారు ముందుకు కదిలింది. దీంతో ఆ కారు కాస్త ఆ జంక్షన్ దాటి ముందుకెళ్లి చెట్టుకి ఢీ కొట్టి ఆగింది. అయితే అదే సమయంలో కారు ముందుకు కదులుతుండగా అటు ఇటు నుంచి వస్తున్న వాహనాలు ఆ కారును గమనించడంతో పెను ప్రమాదమే తప్పింది. ఇదంతా వెనుక నుంచి వస్తున్న కారు డ్రైవర్ గమనించి తన కారులోని కెమెరాతో రికార్డు చేసింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇలా కూడా ప్రమాదాలు జరుగుతాయంటూ నెట్ లో పెట్టడంతో అది కాస్తా కేజ్రీ వీడియోగా నెట్ లో వైరల్ గా మారింది.