బీహార్ లో దారుణం.. బట్టబయలైన రాజకీయ రౌడీయిజం..

బీహార్ లో గూండారాజ్యం రాజ్యమేలుతుందని.. అధికారం మాటున ఇలాంటి అకృత్యాలు అక్కడ నిత్యకృత్యంలా సాగుతుంటాయని ఇప్పటికే దేశవ్యాప్తంగా వున్న టాక్. ఇదే విషయాన్ని గత ఎన్నికలలో బీజేపి ప్రచార అస్త్రంగా కూడా మలుచుకుంది. వాటిని అప్పట్లో ఖండించిన జేడీయు మాత్రం తాము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. బీహార్ ప్రజలు కూడా జేడియు కూటమికే మద్దతు ప్రకటించారు. ఈ తరుణంలో బీజేపి చేసిన విమర్శలు నిజమని పేర్కోంటే ఓ వీడియో బయటికి రావడం కలకలం సృష్టిస్తుంది. 

ఓ విద్యార్థి ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి గదిలో బంధించి చితక్కొడుతున్న వీడియో బయటకు వచ్చి హల్ చల్ చేస్తోంది. అధికార పార్టీ జేడీయూకు చెందిన విద్యార్థి విభాగం నేతలు ఈ దాష్టికానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటన రెండు నెలల కిందటే జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియో రికార్డయిన దృశ్యాల ప్రకారం..  జేడీయూ విద్యార్థి విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి మనీశ్ మాలిక్ శివం అనే విద్యార్థిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఓ గదిలో బంధించి ఆ విద్యార్థి బట్టలు విప్పేసి మరికొందరితో కలసి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన తాజాగా బయటకు రావడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.