టీమ్ స్పిరిట్ అర్థం మార్చి.. లిప్ లాక్ లతో చెలరేగిన బాస్

టీమ్ స్పిరిట్.. ఇది ఎక్కడైనా ఒక జట్టుకు కావాల్సిందే. విజయాన్ని అస్వాదించేందుకు ఇదే ముఖ్యభూమిక పోషిస్తుంది. ఈ పదాన్ని భారతీయులు ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ లో గెలిచినప్పుడు వినబడుతుంది. ఒక రాజకీయ పార్టీ గెలవడానికి పార్టీ క్యాడర్ లో ఐక్యత ఎంత అవసరమో.. ఒక బృందం గెలవడానికి ఇదీ అంతే. ఈ టీమ్ స్పిరిట్ ప్రస్తుత కాలంలో కార్పోరేట్ కార్యాలయాలలో అధికంగా వినబడుతుంది. ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో విజయవంతంగా ముగించడానికి కూడా కావాల్సింది టీమ్ స్పిరిట్. 

అయితే టీమ్ స్పిరిట్ అర్థాన్ని మార్చేసి.. అధర చుంబనాలే నంటూ కొత్త బాష్యాన్ని చెప్పాడు ఓ కంపెనీ బాస్. చైనాలోని ఓ కంపెనీ బాస్ తన మహిళా ఉద్యోగినుల మధ్య టీమ్ స్పిరిట్‌ను పెంచేందుకు ఓ ఆకతాయి పనికి ఒడి గట్టాడు. నోటిలో పెన్నును ముక్కుకు ఆనిచ్చి పట్టుకొని పెదవుల ద్వారానే ఆ పెన్నును స్వీకరించాల్సిందిగా మహిళా ఉద్యోగులను కోరారు. అలా వారు తీసుకున్న పెన్నును మళ్లీ తన పెదవుల ద్వారా వెనక్కి తీసుకున్నారు. పెన్నును కింద జారవేయకుండానే ఈ తతంగాన్ని కొనసాగాలంటూ ఉద్యోగినులను పురమాయించాడు కూడా. వారిలో ఓ మహిళ ఉద్దేశపూర్వకంగానో, పొరపాటునో పెన్నును నేలకు జార విడిచింది. అప్పుడు బాస్ పెదాలు, మహిళా ఉద్యోగి పెదాలకు తగిలినట్లు తెలుస్తోంది.


ఇదో సరదా ఆటని, ఉద్యోగుల్లో ఈ ఆట టీమ్ స్పిరిట్‌ను పెంచుతుందని బాస్ వారిని ప్రోత్సహించారు. ఎవరో ఈ సన్నివేశాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి దాన్ని చైనా వీడియో షేరింగ్ సైట్ అయిన ‘మియోపి’లో పోస్ట్ చేయగా, అది సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ వీడియో ‘యూట్యూబ్’లో దర్శనమిస్తూ మరింత సంచలనం రేపుతోంది. 40 సెకండ్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ మరీ మురిగ్గా ఉందని ఎక్కువ మంది కామెంట్ చేశారు. సాధారణ కంపెనీ అయితే ఈ గేమ్ మాత్రం ఆడదంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘దీన్ని బాస్ భార్య, మహిళా ఉద్యోగినుల భర్తలు చూశారా?’ అంటూ ఇంకొకరు, ‘ఇదే తరహాలో మనం ముద్దుల గేమ్ ఆడొద్దు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంతకు ఆ కంపెనీ ఏమిటో, దాని బాస్ ఎవరో తెలియలేదు.