
భారత ప్రదాని సొంత రాష్ట్రం గుజరాత్ లో సిఎం ఎంపిక చాలా రాజకీయంగా జరిగింది. ఆనందిబెన్ పాటిల్ రాజీనామాతో రంగంలోకి దిగిన బిజెపి అధినాయకత్వం చివరకు గుజరాత్ చీఫ్ విజయ్ రూపానిని సిఎంగా చేసింది. అంతకు ముందు విజయ్ రూపాని పేరు కాకుండా నితిన్ పాటిల్ పేరు మీడియాలో బలంగా వినిపించింది. నితిన్ పాటిల్ గుజరాత్ ఆరోగ్య మంత్రిగా పని చేస్తున్నారు. విజయ్ రూపానిని సిఎంగా, నితిన్ పాటిల్ ను డిప్యూటీ సిఎంగా చేసింది అమిత్ షా టీం.
గుజరాత్ లో గతకొంత కాలం చోటుచేసుకున్న పరిణామాలతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పటేల్ ఉద్యమం, దళితులపై గోరక్షకుల దాడులతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వయసు మీద పడిన ఆనందిబెన్ పాటిల్, తను సిఎం కుర్చీలో కొనసాగలేనని అధిష్టానానికి లేఖ రాసింది. దాంతో ఆమె స్థానంలో విజయ్ రూపాని వచ్చారు. గుజరాత్ బిజెపి పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న నితిన్ గడ్కరీ విజయ్ రూపానిని సిఎంగా, నితిన్ పాటిల్ ను డిప్యూటీ సిఎంగా ప్రకటిస్తూ ప్రకటన చేశారు.