3కోట్ల ఇళ్లు.. 3వేల కోసం తోపుడు బండి- ఊర్వశి జీవితం

జీవితం ఎవడిని వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తది అని టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ గుర్తిందిగా.. అది అక్షరాల నిజం. జీవింతలో ఎవరికి ఎలాంటి టైం వస్తుందో కనీసం ఊహించలేం కూడా. మరి అలాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా పోరాడి ముందుకు సాగేవాళ్లకు జీవితం దాసోహం అంటుంది. గుర్గావ్ కు చెందిన ఊర్వశియాదవ్ అనే మహిళ రియల్ లైఫ్ స్టోరీ ని వింటే జీవితంలో ఇలా కూడా జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతాయి. 

గుర్గావ్ కు చెందిన ఊర్వశి యాదవ్, భర్త అమిత్ యాదవ్ తో దాదాపుగా మూడు కోట్ల విలువైన భవనంలో విలాసవంతంగా జీవితాన్ని గడిపేది. ఓసారి అమిత్ యాదవ్ కు యాక్సిడెంట్ కావడంతో ఆయన మంచానికే పరిమితమయ్యాడు. దాంతో చేసేదేంలేక ఊర్వశియాదవ్ టీచర్ ఉద్యోగం చేసింది. కానీ దాన్ని కూడా వదిలేసి.. ఓ తోపుడు బండి పెట్టుకుంది. తన ఇంటి పక్కనే తోపుడు బండి పెట్టుకొని పరాఠాలు, ఛోలే అమ్ముకుంటోంది. తమ పరువు తీస్తోందని బంధువులు ఎంత అరిచినా ఆమె మాత్రం వినలేదు. రోజుకు మూడు వేలు సంపాదిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆమెకు, ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.