అసోంలో హింసాకాండ.. 12 మంది మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడూ కల్లోలంగా ఉండే అసోంలో మరోసారి హింసాకాండ జరిగి, రక్తపుటేరులు పారాయి. బోడో ఉగ్రదాడుల్లో 14 మంది చనిపోయాగా, 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. భద్రతా దళాలు ముష్కరుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా ఓ దుండగుడిని మాత్రం మట్టుబెట్టారు. ఆ ఉగ్రవాది నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ ముఠాకు చెందిన వ్యక్తి అని తేలింది. ఈ ఉదంతానికి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ కారణం అని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. 

అసోంలోని కోక్రాఝార్ పట్టణానికి దగ్గరలోని ఉన్న బాలాజాన్ తినియాలీ మార్కెట్లో ఈ దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ లో జనాలతో కిక్కిరిసిన టైంలో సైనికుల దుస్తులు, ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్టుంది విచ్చలవిడిగా కాల్పులకు తెగపడ్డారని తెలిసింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోగా.. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.