పాక్ ను ఎండగట్టిన రాజ్ నాథ్ సింగ్

వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ పాకిస్తాన్ ...ఆ దేశంలో ఉండి ఉగ్రవాదులను భారత్‌పై ఉసిగొల్పుతూ నాకేం తెలియదు అంటూ బుకాయించడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి పనులు మానుకోవాలని పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అది కూడా పాక్ గడ్డపై కూర్చొనే. సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశంలో భారత్ తరఫున గట్టి వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 

సార్క్ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవడమే కాదు వారికి మద్దతు తెలిపే వ్యక్తులు, సంస్థలు, దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించడం మానుకోవాలని పరోక్షంగా పాకిస్థాన్‌కు, మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయిాద్‌ను హెచ్చరించారు. రాజ్‌నాథ్ ఉగ్రవాదంపై ప్రసంగిస్తుండగా పాక్ మీడియా ఆ ప్రసంగాన్ని బహిష్కరించింది.