మొత్తానికి జీఎస్టీకి ఆమోదం

మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన జీఎస్టీ బిల్ మొత్తానికి రాజ్యసభ ఆమోదాన్ని పొందింది. గత కొంత కాలంగా జీఎస్టీ బిల్ ను ఎలాగైనా రాజ్యసభలో పాస్ చేయించాలని బిజెపి చేసిన ప్రయత్నాలు ఇప్పటికి మోక్షం కలిగింది. రాజ్యసభలో జీఎస్టీ బిల్ పై సుదీర్ఘ చర్చ తర్వాత ఓటింగ్ లో జీఎస్టీకి ఆమోదముద్ర లభించింది. జీఎస్టీకి మద్దతుగా సభలోని సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో బిల్ పాస్ అయింది. గత యుపిఎ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జీఎస్టీ బిల్ ను కొన్ని మార్పులు చేసి ఇప్పటికి బిజెపి సర్కార్ చట్టం చేయనుంది. 

జీఎస్టీ వల్ల కలిగే లాభాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా జీఎస్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఒక్క కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు నిన్నటి దాకా జీఎస్టీని అడ్డుకున్నాయి. కానీ రాజ్యసభలో బిల్ కు ఆమెదం లభించడం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్ కు ఆమోద ముద్ర లభించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అమలులోకి రానుంది. 

1954లో మొదటిసారిగా జీఎస్టీని ఫ్రాన్స్ తీసుకువచ్చింది. తర్వాత చాలా దేశాలు దీన్ని అమలు పరిచి ఆర్థికంగా బలపడ్డాయి. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, జర్మనీ, చివరకు పాకిస్థాన్ లో కూడా దీన్ని అమలు చేస్తున్నారు.  దీన్ని కేల్కర్ టాస్క్ ఫోర్స్ 2004లో ఇచ్చిన ఇంప్లిమెంట్ ఆఫ్ ఫిక్సల్ రెస్పాన్సిబిలిటి అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్  ( implementation of Fiscal Reforms and Budget Management Act 2003) ప్రకారం తీసుకువచ్చారు.

జీఎస్టీ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పన్నును వసూలు చెయ్యడానికి వీలవుతుంది. అన్ని రకాల పన్నులను నిరోధించి కేవలం జీఎస్టీని మాత్రమే తీసుకురావడం వల్ల పన్ను చెల్లింపులో పారదర్శకత పెరుగుతుంది. జీఎస్టీ వల్ల సినిమా టికెట్లు, పెయింట్స్, సిమెంట్, ఎలక్ట్రానిక్ పరికరాలు, టూ వీలర్ వెహికిల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. కానీ సిగరెట్లు, దుస్తులు, మొబైల్స్, బ్రాండెడ్ నగలు, కమర్షియల్ వాహనాల ధరలు పెరిగే అవకాశాలున్నాయి.