
తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్టార్ గానే కాకుండా కీలకమైన రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గురించి దాదాపుగా అందరికీ తెలుసు. అయితే తాజాగా ఓ పార్టీకి చెందిన వ్యక్తి మాత్రం విచిత్రంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎవరు..? అని ఆయన ప్రశ్నించారు. ఆయనకు ఓ పార్టీ కూడా ఉందా అని ప్రశ్నించడంతో మీడియా ప్రతినిధులు అంతా అవాక్కయ్యారు. ఇంతకీ అలా ప్రశ్నించిన బడా పార్టీ నాయకుడు ఎవరో తెలుసా..? ఆప్ నాయకుడు సోమ్ నాధ్.
తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆప్ పార్టీ సౌతిండియా ఇంఛార్జ్ గా సోమ్ నాధ్ వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీతో ఆప్ కు పొత్తు ఉంటుందా? అని అడిగిన మీడియా ప్రశ్నకు సమాధానంగా అసలు పవన్ కల్యాణ్ అంటే ఎవరో కూడా తెలియదు అన్నట్లు మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఆప్ ఏపీలో అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఏపికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని సోమ్ నాధ్ వివరించారు.