
వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండే కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పై తాజాగా వివాదం తలెత్తింది. పారికర్ చేసిన వ్యాఖ్యలపై కొంత మంది రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ దీనిపై తీవ్రంగా స్పందించారు. పారికర్ బాధ్యత శతృదేశాల నుండి దేశాన్ని కాపాడమే అంతే కానీ సొంత వాళ్లను బెదిరించడం కాదు అని రాహుల్ వ్యాఖ్యానించారు.
గతంలో అమీర్ ఖాన్ దేశం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ ప్రస్తావన ఇప్పుడు తెచ్చిన పారికర్, దేశం గురించి చెడ్డగా మాట్లాడేందుకు ఎలా సాహసిస్తారు అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో, దానికి వివరణ ఇస్తూ, తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని స్పష్టం చేశారు.