
ప్రధాని మోదీకి ప్రాణ హాని ఉందా.? ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న మోదీకి స్వాతంత్ర దినోత్సవం నాడు ఏదైనా జరగనుందా..? అనే అనుమానాలకు నిఘా సంస్థలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రధాని మోదీకి ఉగ్రవాద సంస్థల నుండి ముప్పు ఉందని, జాగ్రత్తగా వ్యవహరించాలని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు సార్లు ఉగ్రవాద సంస్థలు మోదీని టార్గెట్ చేశాయి. కాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చాలా జాగ్రతత్తగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిసింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లోపలి నుండే మాట్లాడాలని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రధాని కాన్వాయ్ పై డ్రోన్ లతోనూ దాడులకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా చోటుచేసుకున్న కాశ్మీర్ అల్లర్లు, సరిహద్దుల నుంచి చొరబాట్లు, ఐసిస్ దాడుల నేపథ్యంలో… ప్రధాని మోడీకి భారీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని నిఘా సంస్థలు తెలిపాయి.