
రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ... ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ తనపై వచ్చిన ఆరోపణలకు చట్టపరంగా సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు. తనపై ఉద్దేశపూరితంగా మీడియా కుట్ర చేస్తోందంటూ పలు సంస్థలపై లీగల్ యాక్షన్ కి సిద్ధమయ్యారు. ప్రముఖ ఎనలిస్ట్, టైమ్స్ నౌ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామిపై ఏకంగా 500 కోట్ల రూపాయలకు దావా వేశారు. అర్నబ్ జకీర్ మత విశ్వాసాలను కించపరిచారంటూ ఆయన తరఫు న్యాయవాది ముబిన్ సోల్కర్ నోటీసులు జారీ చేశారు.
టైమ్స్ ముంబై బ్యూరో చీఫ్ మేఘాప్రసాద్, సీఈఓ అవినాశ్ కౌల్, టైమ్స్ గ్లోబల్ సీఈఓ సునీల్ లుల్లాకు కూడా నోటీసులు పంపించారు. పది మీడియా సంస్థలకు ఈ తరహాలోనే పరువు నష్టం దావా నోటీసుల్ని జకీర్ నాయక్ పంపించారు. అర్నబ్ గోస్వామి మీద ఇప్పటికీ ఇలాంటి పరువు నష్టం దావాలు చాలా వేశారు. కాగా జకీర్ నాయక్ లాగా భారీ మొత్తంలో మాత్రం వెయ్యలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అర్నబ్ మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.