అతన్ని చెప్పుతో కొట్టిన తృప్తి దేశాయ్

శనీశ్వరాలయంలోకి మహిళల ప్రవేశం పై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెర తీసిన తృప్తి దేశాయ్ తన చేతి ప్రతాపాన్ని చూపించింది. నడిరోడ్డు మీద ఓ మగాడిని చెప్పుతో కొట్టింది. తనకు తెలిసిన శిక్షను ఇలా రోడ్డు మీదే వేసిన తృప్తి దేశాయ్ ఆ వ్యక్తి మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె- అహ్మద్ నగర్ రోడ్డుపై ఉన్న శిర్వాల్ అనే గ్రామంలో జరిగింది. 

ఒక మహిళతో సంబంధం పెట్టుకొని.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు తృప్తి దేశాయ్ ఇలా చెప్పుతో కొట్టింది. శ్రీకాంత్ లోంఢే అనే వ్యక్తి ఓ మహిళను ప్రేమించి మోసం చేశాడు. ఆమెకు గర్భం రావడంతో అబార్షన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా.. చూస్తే పెళ్లికి నిరాకరిస్తున్నాడు అని తృప్తి దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోంఢేను తృప్తి కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.