కాశ్మీర్ లో వైద్యం చేస్తారని

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. ఉగ్రవాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన పాకిస్థాన్ తమ దేశంలో ఉన్న వాళ్ల గురించి పట్టించుకోకున్నా.. కాశ్మీర్ లో ఉన్న వాళ్ల గురించి మాత్రం తెగ టెన్షన్ పడుతోంది. మిలిటెంట్ నాయకుడు బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత కాశ్మీర్ లో అల్లర్లు చెలరేగాయి. దాంతో  భద్రతా సిబ్బందికి, నిరసనకారులకు మధ్య రోజూ ఘర్షణ జరుగుతోంది. కాగా భద్రతా బలగాలు పెల్లెట్ పిస్టల్ కారణంగా చాలా మందికి గాయాలయ్యాయి. అయితే వారికి తాము వైద్యం చేస్తామంటూ పాక్ లో 30 మంది పారా మెడికల్ టీం వీసా కోసం అప్లై చేసుకుంది. 

రోజురోజుకు కాశ్మీర్ లో జరుగుతున్న రక్తపాతానికి పాకిస్థాన్ ఆజ్యం పోస్తోంది. కాశ్మీరీలకు వైద్యం పేరుతో జమాత్ ఉద్ దవాకు చెందిన 30 మంది వైద్య సిబ్బంది కాశ్మీర్ వచ్చేందుకు వీసాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. హఫీజ్ సయిద్ నేతృత్వంలో వీరు కాశ్మీర్ లో పర్యటించి వైద్యం అందిస్తారట. పైగా కంటి వైద్యులను కూడా తమతో తీసుకువస్తున్నామని, వీసాలకు అప్లై చేశారు. అయినా ఎప్పుడూ రెచ్చగొట్టి లాభం పొందాలనుకునే హఫీజ్ సయిద్ లాంటి వారి నేతృత్వంలో కాశ్మీర్ లో వాళ్లు ఏం చేస్తారో భారత్ కు బాగా తెలుసు. మరి దీనిపై భారత్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.