చంద్రబాబు ఇంటి ముందు శివాజీ ఆత్మహత్య చేసుకుంటాడట

ప్రముఖ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమాఖ్య నేత శివాజీ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం విశేషం. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇవ్వకుంటే తన శవం కళ్ళ చూస్తారని ఆయన హెచ్చరించారు. ఈ నెల ఇరవైరెండున వచ్చే ప్రత్యేక హోదా బిల్లుపై అన్ని పార్టీలు ఒకటి కావాలని ఆయన డిమాండ్ చేశారు. 

బిల్లు రాకుండా అడ్డుకునే యత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కులాల పేరుతో రెచ్చగొడుతున్నారని శివాజీ అన్నారు. చంద్రబాబు దీనిపై పోరాటానికి సిద్ధపడాలని దీనిపై తాము పోరాటం కొనసాగిస్తున్నామని, తమకు ఏమి చేయాలో తెలుసునని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీల వల్ల ఉపయోగం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా లేకుండా విదేశాలలో తిరిగితే మాత్రం ఉపయోగం ఉంటుందా అని బాబుని ఉద్ధేశించి అన్నారు.