
త్వరలో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీకి చెందిన నవజ్యోత్ సింగ్ సిద్దు.. కమలం పార్టీకి షాక్ ఇచ్చారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. నిన్నటి దాకా కమలం పార్టీలో సాగిన సిద్దు ఉన్నపలంగా రాజ్యసభకు, ప్రాధమిక బిజెపి సభ్యత్వానికి కూడా రాజీనామా చెయ్యడంతో దిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి.
సిద్దూ ఆయన భార్య ఇద్దరూ పంజాబ్ రాజకీయాల్లో చాలా కాలం నుంచి క్రియాశీలంగా ఉన్నారు. సిద్దు ఆప్ అధినేతతో కేజ్రీవాల్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీన్ని నిజం చేస్తున్నట్లుగా ఆయన రాజీనామా చేయడంతో ఒక్కసారిగా పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాదు ఆయన్ను సీఎం అభ్యర్ధిగా కేజ్రీవాల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సిద్దు రాజీనామా చేయడంతో అటు కమలనాథులకు, ఇటు శిరోమణి అకాళీదళ్ కు కూడా షాక్ ఇచ్చినట్లు అయింది.